Monday, 12 September 2016

ఒక వ్యక్తి బ్రాహ్మణుల గురించి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు ముఖపుస్తకములో చూస్తున్నాను.నాకు ఆయన ముఖపుస్తకములో మిత్రుడు కాకపోయినప్పటికి నా మిత్రుల ద్వారా చూశాను.

             సమగ్రముగా విషయము యొక్క అవగాహన లేకపోవటము వలన చేస్తున్న వ్యాఖ్యలు అని కొంచెం అవగాహన వున్న ఎవరికయినా తెలుస్తుంది.మనము చాలా తేలికగా ఆయన వ్యాఖ్యలను నిర్లక్ష్యం చేయవచ్చు.కాని ఆయన తనని తాను ఒక హిందువుగా చెప్పుకుంటూ,బ్రాహ్మణులని విమర్శించటము చేత,విషయాన్ని తెలియజేస్తే అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశ్యముతో,ఇంకా ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకపోతే, ఆయన ఆరోపణలు నిజము అని అనుకునే ప్రమాదం ఉండటము చేత నేను ఈ పోస్ట్ చేస్తున్నాను.

                   కృత యుగములో మనుష్యులు అందరూ బ్రాహ్మణులుగానే ఉండేవారు.ఆ తరువాత నాలుగు వర్ణములుగా విభజింప బడ్డారు.వ్యక్తులు వారి వారికి ఉన్నటువంటి ఆసక్తులని బట్టి వర్ణములను ఏంచుకొనమని చెప్పి ఉండవచ్చు.లేదా ఏంచుకుని వుండవచ్చు.నాలుగు వర్ణముల వారికి వారు వారు చేయవలసిన కర్తవ్యములు నిర్ధారింపబడినాయి .ఎవరి వృత్తిలో వారికి వారి వృత్తికి అనుగుణమయిన జీవన విధానం ఏర్పడచబడింది.అదే విధముగా కొన్ని నియమములు ఏర్పడచ బడ్డాయి.వారి వారి జీవన విధానమును అనుసరించి వారికి అనుగుణమయిన ఉపాసన విధానం ఏర్పరచబడ్డాయి.

               ఇప్పుడు ప్రధానమయిన విమర్శ ఏమిటి అంటే బ్రాహ్మణుల కారణముగానే హిందూ మతం నుండీ మతాంతీకరణ జరుగుతున్నది అని. ఏ మతమునకు అయినా దానికి మూలం ఒక సిద్ధాంతం  ఉంటుంది.ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ మతం విస్తరింప బడుతుంది.కాని హిందూ మతం అనేది ఒక సమగ్ర స్వరూపమయిన ధర్మం.ఇందులో అనేకమయినటువంటి ఆరాధనా విధానముల ద్వారా భగవంతుదిని తెలుసుకున్నటువంటివారు అనేకమంది ఉన్నారు.వారినే మనము ఋషులు అంటాము.అటువంటి ఋషులు అన్ని జాతులలోనూ ఉన్నారు.వారు మానవజాతి సుఖముగా జీవించటం కోసం,తపస్సు చేసి,ఆ తపస్సులో వారు దర్శించినటువంటి , మంత్ర రూపములలో ఉన్నటువంటి అనేక రహస్యములను లోకమునకు తెలియజెశారు.అవే వేదములు.ఇప్పుడూ వైజ్ఞానికముగ  అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజములో రొజు రోజునకు వేదములో ఉన్నటువంటి ఒకొక్క మంత్రము సత్యము అని నిరూపింప పడుతోంది.కాబట్టి వేదము యొక్క గొప్పదనం ఏ హిందువు అయినా తప్పకుండా ఒప్పుకోవాలి.కాని దానిని స్వర యుక్తముగ చదివి రక్షించవలసిన బాధ్యత ఎవరిది?

సుమారుగా 1000 కంటె ఎక్కువ వేద శాఖలు ఉన్నయి.ఈ రోజులలో ఒక వేద శాఖ చదవటానికి సుమారుగా 8 సంవత్సరాలు పడుతుంది.తరువాత దాని అర్థం చదవటానికి సుమారు 6 సంవత్సరాలు పడుతుంది.ఇంకా చదవటానికి రామాయణం ,భారతం మొదలయిన ఇతిహాసములు,18 పురాణములు ఉన్నయి.వీటిలో అనేక రహస్యములు ఉన్నాయి..అన్ని వర్ణములలో కూడ వారి వారి విద్యలలో ప్రావీణ్యత సంపాదించటానికి ఒక జీవిత కాలం పడుతుంది.

     సమాజములో ప్రతి ఒక్కరికి వారు వారు చేయవలసిన కర్తవ్యం నియమింప బడింది.పిల్లవాడు పుట్టినప్పటినుంచి వాడికి జీవితములో వాడి యొక్క లక్ష్యానికి అనుగుణముగా వాని యొక్క జీవన విధానం తీర్చి దిద్దబడింది.తండ్రి ఒక విధానములో ఉంటూ కుమారుడుని వెరొక జీవన విధానం నేర్పటం చాలా కష్టమయిన పని.

                 ఈ సంస్కృతి,వీటిలో ఉన్నటువంటి విద్యలు,కళలు ఇలాగ కొన్ని లక్షల సంవత్సరాల నుండి కాపాడబడుతున్నయి.వ్యక్తులు వారి వారి యొక్క కుల వృత్తులని వదిలినప్పటి నుంది ఆయా వృత్తులలో నిపుణులని మనం కోల్పోయాం.శాస్త్రీయంగా జరిగిన ఒక పరిశోధనలో ,వీడియో గేం ఆడే పిల్లలో వారి యొక్క జన్యువులు వీడియో గేం లకు అనుగుణముగా మారుతున్నాయిట.అంటే వారి వారి వృత్తులకు అనుగుణముగా వ్యక్తుల జన్యువులు మార్ఫు చెంది తరువాత తరువాత వారి సంతానములో కూడ దానికి అనుగుణమయిన అలోచన విధానం ఏర్పడి ఆయా విద్యలలో ఉత్తమ మయిన వ్యక్తులు తయారయ్యె వారు.      

    ఏ కులములో ఉన్నటువంటి వ్యక్తులు అయినా భగవత్ సంబంధమయిన సాధనలో ఉత్తమ స్థితి పొందినప్పుడు వారికి సముచితిమయిన స్థానం ఇవ్వటం లో హిందు సమాజం ఎప్పుడు వెనకడుగు వేయలేదు.ఆనాటి వాల్మీకి నుండీ ఈ నాటి వివేకానందుడి వరకు అనేక సాక్ష్యములు ఉన్నాయి.

          ఇవి కాకుండా అంటరాని తనం మొదలయిన దురలవాట్ల గురించి విమర్శలు ఉన్నాయి.మిగిలిన మతములలో వీటి కంటె దారుణమయిన పద్ధతులు ఉన్నయి.వ్యవస్థలలో దొషములు ఉన్నాయని వాటిని నాశనం చేసే పద్ధతులను అనుసరించుట తప్పు.వ్యవస్థను చక్కదిద్దుకోవాలి.

                       వివేకనందుడు ఒకానొక సందర్భములో మనువు యొక్క వాక్యాలను ఈ విధముగ చెప్పాడు."హిందు మతమును రక్షించే ఒక సైనికుడు బ్రహ్మణుడు అని".

                      ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రం వేద విద్యలను అభ్యసించి వాటిని రక్షించటం కోసం జీవిస్తున్నారు.వారు చదువుకున్న చదువులో వందవ సాతం చదివిన వారు వారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నరు.అయినప్పటికీ ధర్మము యందు ఉన్నటువంటి మక్కువతో వారు కష్టపడి చదువుతున్నారు.వారిని కూడ యజ్ఞొపవీతం వేసుకోనుట తప్పు అంటూ విమర్శించి వారి యొక్క బాధ్యత నుండి వారిని పక్కకు మరలించే ప్రయత్నం చేయుట చాలా తప్పు.మీరు నమ్మే భగవంతుడు క్షమించడు.
 
                     ఈ వర్ణ వ్యవస్థ కరణముగానే మతాంతీకరణ జరుగుతోంది అనేది వట్టి భ్రమ. లార్ద్ మెకాలె బ్రిటీష్ పార్లమెంటులో 1826 లో చేసిన ప్రకటన ద్వారా మనము ఈ విషయాన్ని చెప్పవచ్చు. ఈ దెశములో మనుష్యులు ఎంత నిజాయితీగ ఉండెవారో చెప్పాడు.భారతీయులు ఎంత సుఖముగ జీవిస్తున్నరొ చెప్పాడు.ఎక్కువ కులములు, తక్కువ కులములు అని ఒకరంటె ఒకరికి ద్వేషం ఉంటే భారతీయులు సుఖముగ 1826 ప్రాంతములో ఉండేవారు కాదు.

                     యజ్ఞోపవీతం ధరించే వారిలో బ్రహ్మణులు ఒక్కరే కాకుండా అన్ని వర్ణాలలో వారు ఉన్నరు.మన యొక్క అలవాట్లలో ప్రతి దానిలో వైజ్ఞానిక  అంశం ఉన్నది అని నా ప్రగాఢ విస్వాసం.అలా చాల మటుకు నిరూపింప బడ్డయి.అదే విధముగా యజ్ఞోపవీతం కూడ ఎప్పుడో ఒకప్పుడు  నిరూపింప బడుతుంది.

          ప్రతి సమాజం లొ ఆయా వ్యక్తుల అందరి అలవాట్లు పూర్తిగా ఒక్క రకముగా ఉండవలసిన అవసరం లేదు.అన్ని కులములు పరస్పరం గౌరవించుకుంటు, వారి యొక్క ధర్మములను వదలకుండ ఉన్నప్పుడే ఈ సమాజం మన గల్గుతుంది.ఇన్ని బేధాలు ఉన్నప్పటికి ప్రపంచములో మిగిలిన సమాజముల కంటే మన సమాజం ఎందుకు ప్రశాంతముగ జీవించ గలుగుతోంది?ఏ విధముగ కొన్ని లక్షల సంవత్సరాల నుండీ తన ఉనికిని కాపాడుకోగలుగుతోంది? ఒక వర్గం పట్ల పక్షపాతం తో ఉన్నటువంటి సమాజం ఇన్ని సంవత్సరాలు తన ఉనికిని కాపాడుకున్నట్లుగా చరిత్రలో ఎక్కడయినా చుశార ?ఒక సారి అలోచించండి.

Tuesday, 4 December 2012

FDI


my dear friends,
                    now a lot of discussion is going on regarding FDIs. As a common man here I am sharing my thoughts.
                   First of all let us list out what are the pros and cons of FDIs
    pros                                                    
1.compition in market increases. So demand to the product from market people increases. So farmer      will get   reasonable price for his product.
2. Markets will buy product directly from farmers. So there will be no mediators. This can be advantage to Farmers as well as customers.
3.Already we allowed foreign companies in IT, Automobile Industry etc..In those industries millions of jobs created in India. In the same way due to  FDIs also millions of jobs will be created.

these are the some of the pros listed by the pro-FDI people.
Now let me analyze the above things.
when we see the above things we think they are right. when we look in to them.. .
        As normal business people can't afford more when compare to Wal-Mart etc..after some days all the small businesses will be closed. After that all the Indian retail market will be in the hands of 1 or 2 big companies, and then automatically they will decide the price of the product. If the farmer is not ready to sell his product to them for their price they will buy some other genetically modified product from Africa or Indonesia or their own forms from America .Then it will be very difficult to re-Establish Indian style retail shops immediately. As this market is developed from hundreds or thousands of years in India. Some families completely dependent on this.
                              Now in India Crores of people are working in retail market. I don't think that these foreign companies will give such many jobs.
                            The next move of the foreign companies will be to get the market of seeds and fertilizers. They will supply genetically modified seeds and fertilizers to Farmers and will make agreement with farmers and will buy their products. Or they will force farmers to use their seeds and fertilizers .But after some years all the natural seeds with farmers will be lost. As genetically modified seeds won't produce new seeds the farmers need to depend on companies completely.

     At last my view is concentration of business to some companies is very Dangerous. And particularly to those companies which represents other countries is very Dangerous. India is very big market. So, In all possible ways those countries will try to occupy our country's market.

  one more thing please pardon for my Vinglish.

Monday, 25 July 2011

Anaganaga Oka Raju..

అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆయనకి ముగ్గురు భార్యలు.లక్ష్మి,సుజాత,సౌందర్య. లక్ష్మికి తొమ్మిది మంది సంతానం.
సుజాతకి పది మంది సంతానం.సౌందర్యకి నలుగు సంతానం .రాజు గారి ముగ్గురు భార్యల సంతానము ఐకమత్యంగా ఉండేవారు .రాజుగారు స్వర్గానికి వెళ్ళాక వీళ్ళందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు.ప్రతి అయిదు సంవత్సరాలకి రాజ్యం లోని జనాలను తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోమనేవారు రాజ్యం చాల సుభిక్షముగా ఉండేది.ఒకవేళ ఒకవేళ సామంత రాజులూ గాని శత్రు దేశపు రాజులూ గాని దాడికి వచ్చినా అందరు కలిసి ఎదుర్కొనేవారు. దానితో శత్రు దేశపు రాజులని జయిస్తూ సంతోషముగా ఉండేవారు.రాణి సుజాత కుమారులు తెలివైన వాళ్ళు. ఏదో ఒక విధముగా ప్రజలని మభ్యపెట్టో భయపెట్టో సంతోష పెట్టో రాజ్యాన్ని చాలా కాలం తామే పరిపాలించేవారు . మిగిలిన రాణుల సంతానం ఆ విధంగానే ప్రయత్నించే వారు కాని  అంత సఫలీకృతులు అయ్యేవారు కాదు.మోతము మీద ఏఎ
రాజు పరిపాలించినా తన స్వార్థం కోసమే పనిచేసేవాడు ఏ రాణి కొడుకు ఆయినా రాజ్యాన్ని తినడానికే ప్రయత్నిచేవారు .కానీ ప్రజలు సమిష్టిగా ఉండడముతో రాజ్యం సుభిక్షముగా ఉండేది .రాణి  సౌందర్య  అయిదవ కుమారుడు అయిన చంద్ర శేఖర  వర్మకి ఈ విధముగా పంచుకుని పరిపాలించే  పధ్ధతి నచ్చలేదు. ఈ పద్ధతి వల్ల
తనకు రాజ్యాధికారం వచ్చే అవకాశం చాల తక్కువగా ఉంది.ఎందుకంటే తనకంటే సమర్థులు తన సోదరులలో కూడా ఉన్నారు. అందువల్ల తన సోదరులకు వచ్చినా తనకు రాదని తెలిసి ఒక కుట్ర పన్నాడు. రాజ్యాన్ని విభజించి ముగ్గురు భార్యల సంతానానికి సమానంగా పంచాలని ఒక వాదం తీసుకు వచ్చాడు .  ఈ విధముగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టాడు.వాళ్ళందరికీ ఏమి పని చేయకపోయినా ఉచిత భోజనం దొరుకుతుందని,ఉచిత వస్త్రాలు ,ఉచిత గృహాలు దొరుకుతాయని ,తను పరిపాలించిన ప్రదేశములో ఆ ఏర్పాట్లు తను చేస్తానని ప్రజలను మభ్య పెట్టాడు.అతడు ఎ  ప్రాంతన్నైతే తన రాజ్యంగా తీసుకుంటానని గొడవ చేస్తున్నాడో ఆ ప్రాంత ప్రజలు ఆ మాటలను  నమ్మారు. రాజుని ఎన్నుకునే సమయములో అతడిని సమర్థించారు.తెలివైన సుజాత సంతానం అతనికి ధనమును ఆశగా చూపి ఆ ఎన్నిక తరువాత ప్రత్యేక రాజ్యము ఇస్తామని ప్రజలని మభ్యపెట్టమని చెప్పి అతని బలమును కూడా తాము పొందారు .ఆ తరువాత ఎప్పటి వలె ఉమ్మడి రాజ్యముగా పలిమ్పబడింది .  
  ఎన్నిక సమయము వచినప్పుడల్లా చంద్రశేఖర వర్మ ప్రత్యేక రాజ్యం గురించి మాట్లాడడం తెర వెనుక సుజాత సంతానముతో కలిసి నాటకమడేవాడు .దానితో ప్రజలు అతనిని నమ్మడం మానేసారు. ఇంకా తన అస్త్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది .ఇక ఇలా కాదని ఒక రోజు ఏఎ గొడవ ఎక్కువ స్థాయిలో మొదలు పెట్టాడు. ఎప్పటి నుంచో ఈ రేఅజ్యాన్ని అస్తిరపరచి తమ ఆధీనములో ఉంచుకోవాలని చూసే బందిపోటులు ప్రజలలో కలసి ఇతను చేసే గొడవని పెద్దదిగా చేసారు. యువకులను ఆత్మహత్యలకు ప్రోత్సహించారు. రాజ్యం అస్తిరమయిపోయింది .రాజ్యంలోని జనులు నానా అవస్థలు పడ్డారు.రాజ్యం యొక్క అభివృద్ధి కుంటుపడింది .ఎట్టకేలకు ముగ్గురు తల్లులు కలసి రాజ్యం కోసం, రాజ్యం లోని జనుల కోసం రాజ్యాన్ని మూడు రాజ్యాలుగా విభజించారు.అప్పుడు మూడు చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి.చంద్రశేఖర వర్మ రాజ్యములోని ముఖ్య ప్రదేశాలను తన రాజ్యములోకి వచ్చేటట్లు  చేసుకున్నాడు. తరువాత ప్రతి చిన్న రాజ్యముని ఆయ రాజులు దోచుకు తినేవారు. అలాగే బందిపోటులు కూడా ప్రతి రాజ్యములోను తిష్ట వేసారు.ముఖ్యముగా చంద్రశేఖర వర్మ రాజ్యములో బందిపోటులు  ప్రజలకు ప్రత్యేక రాజ్యము కోసం సహకరించుట చేత ప్రజలు వీళ్ళను మంచివారుగా భావించారు.దానితో ఆ  బందిపోటులు రాజ్యాన్ని సర్వనాసనం చేసారు .ఇంతకు ముందర రాజులు తిన్నా ప్రజలు సమిష్టిగా ఉండడము చేత చాలా సమస్యలు అధిగామించేవారు .కానీ తరువాత వాళ్ళలో వాళ్ళు  కొట్టుకున్నారు .ఇతర దేశపు రాజుల చేతులలో చావు దెబ్బలు తిన్నారు.

                              ఒక మూర్ఖుడిని నమ్మిన జనం యొక్క పరిస్థితి ఏఎ విధముగా నాశనము అవ్వటమే కాక ఆ చుట్టూ ఉండేవారి పరిస్థితి కుడా నాశనం అయ్యింది .

                            ఆ భగవంతుడు ఇటువంటి మూర్ఖులను అదుపులో పెట్టి,ప్రజలు మూర్ఖుల మాటలు వినకుండా చేసి ,ఏఎ రాజ్యానికి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రార్థిస్తూ 


మీ ,
సోదిగాడు 











       

Sunday, 3 July 2011

Hai...


ప్రియమైన నా తెలుగు  మిత్రులారా! నాకు మీతో మాట్లాడాలని అనిపించింది. కాని నా సోది ఎవడు వింటాడో తెలియల.అందుకే ఈ బ్లాగ్ మొదలుపెట్టా.మీకు నా సోది నచ్చితే సంతోషంగా నాకు సోదిరత్న అనే బిరుదు ఇస్తారని అసిస్థూ ....


                                                                               మీ సోదిగాడు