అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆయనకి ముగ్గురు భార్యలు.లక్ష్మి,సుజాత,సౌందర్య. లక్ష్మికి తొమ్మిది మంది సంతానం.
సుజాతకి పది మంది సంతానం.సౌందర్యకి నలుగు సంతానం .రాజు గారి ముగ్గురు భార్యల సంతానము ఐకమత్యంగా ఉండేవారు .రాజుగారు స్వర్గానికి వెళ్ళాక వీళ్ళందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు.ప్రతి అయిదు సంవత్సరాలకి రాజ్యం లోని జనాలను తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోమనేవారు రాజ్యం చాల సుభిక్షముగా ఉండేది.ఒకవేళ ఒకవేళ సామంత రాజులూ గాని శత్రు దేశపు రాజులూ గాని దాడికి వచ్చినా అందరు కలిసి ఎదుర్కొనేవారు. దానితో శత్రు దేశపు రాజులని జయిస్తూ సంతోషముగా ఉండేవారు.రాణి సుజాత కుమారులు తెలివైన వాళ్ళు. ఏదో ఒక విధముగా ప్రజలని మభ్యపెట్టో భయపెట్టో సంతోష పెట్టో రాజ్యాన్ని చాలా కాలం తామే పరిపాలించేవారు . మిగిలిన రాణుల సంతానం ఆ విధంగానే ప్రయత్నించే వారు కాని అంత సఫలీకృతులు అయ్యేవారు కాదు.మోతము మీద ఏఎ
రాజు పరిపాలించినా తన స్వార్థం కోసమే పనిచేసేవాడు ఏ రాణి కొడుకు ఆయినా రాజ్యాన్ని తినడానికే ప్రయత్నిచేవారు .కానీ ప్రజలు సమిష్టిగా ఉండడముతో రాజ్యం సుభిక్షముగా ఉండేది .రాణి సౌందర్య అయిదవ కుమారుడు అయిన చంద్ర శేఖర వర్మకి ఈ విధముగా పంచుకుని పరిపాలించే పధ్ధతి నచ్చలేదు. ఈ పద్ధతి వల్ల
తనకు రాజ్యాధికారం వచ్చే అవకాశం చాల తక్కువగా ఉంది.ఎందుకంటే తనకంటే సమర్థులు తన సోదరులలో కూడా ఉన్నారు. అందువల్ల తన సోదరులకు వచ్చినా తనకు రాదని తెలిసి ఒక కుట్ర పన్నాడు. రాజ్యాన్ని విభజించి ముగ్గురు భార్యల సంతానానికి సమానంగా పంచాలని ఒక వాదం తీసుకు వచ్చాడు . ఈ విధముగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టాడు.వాళ్ళందరికీ ఏమి పని చేయకపోయినా ఉచిత భోజనం దొరుకుతుందని,ఉచిత వస్త్రాలు ,ఉచిత గృహాలు దొరుకుతాయని ,తను పరిపాలించిన ప్రదేశములో ఆ ఏర్పాట్లు తను చేస్తానని ప్రజలను మభ్య పెట్టాడు.అతడు ఎ ప్రాంతన్నైతే తన రాజ్యంగా తీసుకుంటానని గొడవ చేస్తున్నాడో ఆ ప్రాంత ప్రజలు ఆ మాటలను నమ్మారు. రాజుని ఎన్నుకునే సమయములో అతడిని సమర్థించారు.తెలివైన సుజాత సంతానం అతనికి ధనమును ఆశగా చూపి ఆ ఎన్నిక తరువాత ప్రత్యేక రాజ్యము ఇస్తామని ప్రజలని మభ్యపెట్టమని చెప్పి అతని బలమును కూడా తాము పొందారు .ఆ తరువాత ఎప్పటి వలె ఉమ్మడి రాజ్యముగా పలిమ్పబడింది .
ఎన్నిక సమయము వచినప్పుడల్లా చంద్రశేఖర వర్మ ప్రత్యేక రాజ్యం గురించి మాట్లాడడం తెర వెనుక సుజాత సంతానముతో కలిసి నాటకమడేవాడు .దానితో ప్రజలు అతనిని నమ్మడం మానేసారు. ఇంకా తన అస్త్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది .ఇక ఇలా కాదని ఒక రోజు ఏఎ గొడవ ఎక్కువ స్థాయిలో మొదలు పెట్టాడు. ఎప్పటి నుంచో ఈ రేఅజ్యాన్ని అస్తిరపరచి తమ ఆధీనములో ఉంచుకోవాలని చూసే బందిపోటులు ప్రజలలో కలసి ఇతను చేసే గొడవని పెద్దదిగా చేసారు. యువకులను ఆత్మహత్యలకు ప్రోత్సహించారు. రాజ్యం అస్తిరమయిపోయింది .రాజ్యంలోని జనులు నానా అవస్థలు పడ్డారు.రాజ్యం యొక్క అభివృద్ధి కుంటుపడింది .ఎట్టకేలకు ముగ్గురు తల్లులు కలసి రాజ్యం కోసం, రాజ్యం లోని జనుల కోసం రాజ్యాన్ని మూడు రాజ్యాలుగా విభజించారు.అప్పుడు మూడు చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి.చంద్రశేఖర వర్మ రాజ్యములోని ముఖ్య ప్రదేశాలను తన రాజ్యములోకి వచ్చేటట్లు చేసుకున్నాడు. తరువాత ప్రతి చిన్న రాజ్యముని ఆయ రాజులు దోచుకు తినేవారు. అలాగే బందిపోటులు కూడా ప్రతి రాజ్యములోను తిష్ట వేసారు.ముఖ్యముగా చంద్రశేఖర వర్మ రాజ్యములో బందిపోటులు ప్రజలకు ప్రత్యేక రాజ్యము కోసం సహకరించుట చేత ప్రజలు వీళ్ళను మంచివారుగా భావించారు.దానితో ఆ బందిపోటులు రాజ్యాన్ని సర్వనాసనం చేసారు .ఇంతకు ముందర రాజులు తిన్నా ప్రజలు సమిష్టిగా ఉండడము చేత చాలా సమస్యలు అధిగామించేవారు .కానీ తరువాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు .ఇతర దేశపు రాజుల చేతులలో చావు దెబ్బలు తిన్నారు.
ఒక మూర్ఖుడిని నమ్మిన జనం యొక్క పరిస్థితి ఏఎ విధముగా నాశనము అవ్వటమే కాక ఆ చుట్టూ ఉండేవారి పరిస్థితి కుడా నాశనం అయ్యింది .
ఆ భగవంతుడు ఇటువంటి మూర్ఖులను అదుపులో పెట్టి,ప్రజలు మూర్ఖుల మాటలు వినకుండా చేసి ,ఏఎ రాజ్యానికి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రార్థిస్తూ
మీ ,
సోదిగాడు
No comments:
Post a Comment