Monday, 12 September 2016

ఒక వ్యక్తి బ్రాహ్మణుల గురించి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు ముఖపుస్తకములో చూస్తున్నాను.నాకు ఆయన ముఖపుస్తకములో మిత్రుడు కాకపోయినప్పటికి నా మిత్రుల ద్వారా చూశాను.

             సమగ్రముగా విషయము యొక్క అవగాహన లేకపోవటము వలన చేస్తున్న వ్యాఖ్యలు అని కొంచెం అవగాహన వున్న ఎవరికయినా తెలుస్తుంది.మనము చాలా తేలికగా ఆయన వ్యాఖ్యలను నిర్లక్ష్యం చేయవచ్చు.కాని ఆయన తనని తాను ఒక హిందువుగా చెప్పుకుంటూ,బ్రాహ్మణులని విమర్శించటము చేత,విషయాన్ని తెలియజేస్తే అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశ్యముతో,ఇంకా ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకపోతే, ఆయన ఆరోపణలు నిజము అని అనుకునే ప్రమాదం ఉండటము చేత నేను ఈ పోస్ట్ చేస్తున్నాను.

                   కృత యుగములో మనుష్యులు అందరూ బ్రాహ్మణులుగానే ఉండేవారు.ఆ తరువాత నాలుగు వర్ణములుగా విభజింప బడ్డారు.వ్యక్తులు వారి వారికి ఉన్నటువంటి ఆసక్తులని బట్టి వర్ణములను ఏంచుకొనమని చెప్పి ఉండవచ్చు.లేదా ఏంచుకుని వుండవచ్చు.నాలుగు వర్ణముల వారికి వారు వారు చేయవలసిన కర్తవ్యములు నిర్ధారింపబడినాయి .ఎవరి వృత్తిలో వారికి వారి వృత్తికి అనుగుణమయిన జీవన విధానం ఏర్పడచబడింది.అదే విధముగా కొన్ని నియమములు ఏర్పడచ బడ్డాయి.వారి వారి జీవన విధానమును అనుసరించి వారికి అనుగుణమయిన ఉపాసన విధానం ఏర్పరచబడ్డాయి.

               ఇప్పుడు ప్రధానమయిన విమర్శ ఏమిటి అంటే బ్రాహ్మణుల కారణముగానే హిందూ మతం నుండీ మతాంతీకరణ జరుగుతున్నది అని. ఏ మతమునకు అయినా దానికి మూలం ఒక సిద్ధాంతం  ఉంటుంది.ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ మతం విస్తరింప బడుతుంది.కాని హిందూ మతం అనేది ఒక సమగ్ర స్వరూపమయిన ధర్మం.ఇందులో అనేకమయినటువంటి ఆరాధనా విధానముల ద్వారా భగవంతుదిని తెలుసుకున్నటువంటివారు అనేకమంది ఉన్నారు.వారినే మనము ఋషులు అంటాము.అటువంటి ఋషులు అన్ని జాతులలోనూ ఉన్నారు.వారు మానవజాతి సుఖముగా జీవించటం కోసం,తపస్సు చేసి,ఆ తపస్సులో వారు దర్శించినటువంటి , మంత్ర రూపములలో ఉన్నటువంటి అనేక రహస్యములను లోకమునకు తెలియజెశారు.అవే వేదములు.ఇప్పుడూ వైజ్ఞానికముగ  అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజములో రొజు రోజునకు వేదములో ఉన్నటువంటి ఒకొక్క మంత్రము సత్యము అని నిరూపింప పడుతోంది.కాబట్టి వేదము యొక్క గొప్పదనం ఏ హిందువు అయినా తప్పకుండా ఒప్పుకోవాలి.కాని దానిని స్వర యుక్తముగ చదివి రక్షించవలసిన బాధ్యత ఎవరిది?

సుమారుగా 1000 కంటె ఎక్కువ వేద శాఖలు ఉన్నయి.ఈ రోజులలో ఒక వేద శాఖ చదవటానికి సుమారుగా 8 సంవత్సరాలు పడుతుంది.తరువాత దాని అర్థం చదవటానికి సుమారు 6 సంవత్సరాలు పడుతుంది.ఇంకా చదవటానికి రామాయణం ,భారతం మొదలయిన ఇతిహాసములు,18 పురాణములు ఉన్నయి.వీటిలో అనేక రహస్యములు ఉన్నాయి..అన్ని వర్ణములలో కూడ వారి వారి విద్యలలో ప్రావీణ్యత సంపాదించటానికి ఒక జీవిత కాలం పడుతుంది.

     సమాజములో ప్రతి ఒక్కరికి వారు వారు చేయవలసిన కర్తవ్యం నియమింప బడింది.పిల్లవాడు పుట్టినప్పటినుంచి వాడికి జీవితములో వాడి యొక్క లక్ష్యానికి అనుగుణముగా వాని యొక్క జీవన విధానం తీర్చి దిద్దబడింది.తండ్రి ఒక విధానములో ఉంటూ కుమారుడుని వెరొక జీవన విధానం నేర్పటం చాలా కష్టమయిన పని.

                 ఈ సంస్కృతి,వీటిలో ఉన్నటువంటి విద్యలు,కళలు ఇలాగ కొన్ని లక్షల సంవత్సరాల నుండి కాపాడబడుతున్నయి.వ్యక్తులు వారి వారి యొక్క కుల వృత్తులని వదిలినప్పటి నుంది ఆయా వృత్తులలో నిపుణులని మనం కోల్పోయాం.శాస్త్రీయంగా జరిగిన ఒక పరిశోధనలో ,వీడియో గేం ఆడే పిల్లలో వారి యొక్క జన్యువులు వీడియో గేం లకు అనుగుణముగా మారుతున్నాయిట.అంటే వారి వారి వృత్తులకు అనుగుణముగా వ్యక్తుల జన్యువులు మార్ఫు చెంది తరువాత తరువాత వారి సంతానములో కూడ దానికి అనుగుణమయిన అలోచన విధానం ఏర్పడి ఆయా విద్యలలో ఉత్తమ మయిన వ్యక్తులు తయారయ్యె వారు.      

    ఏ కులములో ఉన్నటువంటి వ్యక్తులు అయినా భగవత్ సంబంధమయిన సాధనలో ఉత్తమ స్థితి పొందినప్పుడు వారికి సముచితిమయిన స్థానం ఇవ్వటం లో హిందు సమాజం ఎప్పుడు వెనకడుగు వేయలేదు.ఆనాటి వాల్మీకి నుండీ ఈ నాటి వివేకానందుడి వరకు అనేక సాక్ష్యములు ఉన్నాయి.

          ఇవి కాకుండా అంటరాని తనం మొదలయిన దురలవాట్ల గురించి విమర్శలు ఉన్నాయి.మిగిలిన మతములలో వీటి కంటె దారుణమయిన పద్ధతులు ఉన్నయి.వ్యవస్థలలో దొషములు ఉన్నాయని వాటిని నాశనం చేసే పద్ధతులను అనుసరించుట తప్పు.వ్యవస్థను చక్కదిద్దుకోవాలి.

                       వివేకనందుడు ఒకానొక సందర్భములో మనువు యొక్క వాక్యాలను ఈ విధముగ చెప్పాడు."హిందు మతమును రక్షించే ఒక సైనికుడు బ్రహ్మణుడు అని".

                      ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రం వేద విద్యలను అభ్యసించి వాటిని రక్షించటం కోసం జీవిస్తున్నారు.వారు చదువుకున్న చదువులో వందవ సాతం చదివిన వారు వారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నరు.అయినప్పటికీ ధర్మము యందు ఉన్నటువంటి మక్కువతో వారు కష్టపడి చదువుతున్నారు.వారిని కూడ యజ్ఞొపవీతం వేసుకోనుట తప్పు అంటూ విమర్శించి వారి యొక్క బాధ్యత నుండి వారిని పక్కకు మరలించే ప్రయత్నం చేయుట చాలా తప్పు.మీరు నమ్మే భగవంతుడు క్షమించడు.
 
                     ఈ వర్ణ వ్యవస్థ కరణముగానే మతాంతీకరణ జరుగుతోంది అనేది వట్టి భ్రమ. లార్ద్ మెకాలె బ్రిటీష్ పార్లమెంటులో 1826 లో చేసిన ప్రకటన ద్వారా మనము ఈ విషయాన్ని చెప్పవచ్చు. ఈ దెశములో మనుష్యులు ఎంత నిజాయితీగ ఉండెవారో చెప్పాడు.భారతీయులు ఎంత సుఖముగ జీవిస్తున్నరొ చెప్పాడు.ఎక్కువ కులములు, తక్కువ కులములు అని ఒకరంటె ఒకరికి ద్వేషం ఉంటే భారతీయులు సుఖముగ 1826 ప్రాంతములో ఉండేవారు కాదు.

                     యజ్ఞోపవీతం ధరించే వారిలో బ్రహ్మణులు ఒక్కరే కాకుండా అన్ని వర్ణాలలో వారు ఉన్నరు.మన యొక్క అలవాట్లలో ప్రతి దానిలో వైజ్ఞానిక  అంశం ఉన్నది అని నా ప్రగాఢ విస్వాసం.అలా చాల మటుకు నిరూపింప బడ్డయి.అదే విధముగా యజ్ఞోపవీతం కూడ ఎప్పుడో ఒకప్పుడు  నిరూపింప బడుతుంది.

          ప్రతి సమాజం లొ ఆయా వ్యక్తుల అందరి అలవాట్లు పూర్తిగా ఒక్క రకముగా ఉండవలసిన అవసరం లేదు.అన్ని కులములు పరస్పరం గౌరవించుకుంటు, వారి యొక్క ధర్మములను వదలకుండ ఉన్నప్పుడే ఈ సమాజం మన గల్గుతుంది.ఇన్ని బేధాలు ఉన్నప్పటికి ప్రపంచములో మిగిలిన సమాజముల కంటే మన సమాజం ఎందుకు ప్రశాంతముగ జీవించ గలుగుతోంది?ఏ విధముగ కొన్ని లక్షల సంవత్సరాల నుండీ తన ఉనికిని కాపాడుకోగలుగుతోంది? ఒక వర్గం పట్ల పక్షపాతం తో ఉన్నటువంటి సమాజం ఇన్ని సంవత్సరాలు తన ఉనికిని కాపాడుకున్నట్లుగా చరిత్రలో ఎక్కడయినా చుశార ?ఒక సారి అలోచించండి.

No comments:

Post a Comment